Nalgonda District: హత్యారాజకీయాలు చేస్తే... నల్గొండ మోరీలన్నీ మొండాలతో నింపేస్తాం: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • కేసీఆర్ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు
  • మేము హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తే నల్గొండ మోరీలన్నీ మొండాలతో నిండిపోతాయి 
  • కేసీఆర్ కు దమ్ముంటే నల్గొండలో నాపై పోటీ చేయాలి

తాము హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే.. నల్గొండలో మోరీలన్నీ మొండాలతో నింపేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. నల్గొండలో నిర్వహించిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ, బొడ్డుపల్లి శ్రీనివాస్ బతికి లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయనకు దమ్ముంటే నల్గొండలో తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిన పార్టీ తమదని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం కిరాయి హంతకుడిగా మారాడని ఆయన విమర్శించారు. అయినప్పటికీ తమకు న్యాయస్థానంపై నమ్మకముందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామని ఆయన తెలిపారు. 

Nalgonda District
komatireddy venkatreddy
boddupalli srinivas
  • Loading...

More Telugu News