Chandrababu: చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసిన రాజ్ నాథ్.. ఇంకెంత కాలం ఎదురుచూడాలన్న బాబు!

  • చంద్రబాబుకు ఫోన్ చేసిన రాజ్ నాథ్
  • సుమారు పదిహేను నిమిషాల పాటు మాట్లాడిన కేంద్ర మంత్రి
  • పునర్విభజన చట్టాన్ని మాత్రమే అమలు చేయమని కోరుతున్నామన్న ముఖ్యమంత్రి

కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై సందర్భానుసారంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లాలని టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో తమ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు సూచించినట్టు సమాచారం. అయితే, ఈ సమావేశం ముగుస్తుందనగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చింది. ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబును రాజ్ నాథ్ కోరగా, అందుకు, బాబు ఘాటుగానే స్పందించినట్టు టీడీపీ వర్గాల సమాచారం.

 సుమారు పదిహేను నిమిషాల పాటు చంద్రబాబుతో రాజ్ నాథ్ మాట్లాడారని, బాబుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనే మాటను ప్రధాని మోదీ మాటగా పరిగణించాలని, అన్ని హామీలు నెరవేర్చుతామని బాబుతో రాజ్ నాథ్ అన్నట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, ఇంకెంత కాలం ఎదురుచూడాలని, కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వారి అభిప్రాయం మేరకు తాము నడచుకోవాల్సి ఉందని రాజ్ నాథ్ కు చెప్పారట. ఏపీకి  ప్రత్యేక ప్యాకేజ్, రైల్వేజోన్ అంశాలపై ఓ ప్రకటన వెలువడే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేపడతామని చంద్రబాబు తెగేసి చెప్పారట. పునర్విభజన చట్టాన్ని మాత్రమే అమలు చేయమని కోరుతున్నామని రాజ్ నాథ్ కు బాబు చెప్పారని టీడీపీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News