boy beaten by father: పిల్లాడ్ని చావబాదిన తండ్రి ఎక్కుడుంటాడో చెప్పండి... అతన్ని అంతకంటే ఎక్కువే కొడతా!: హీరో సుధీర్ బాబు

  • ఫేస్ బుక్ లో స్పందించిన నటుడు
  • అతన్ని తండ్రిగా పిలవడమే సిగ్గుచేటని వ్యాఖ్య
  • వీడియో కూడా పోస్ట్

బెంగళూరు నగరంలో ఓ వ్యక్తి తన పదేళ్ల కుమారుడ్ని చావబాదిన ఘటనపై ప్రముఖ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు. అతడు ఎక్కుడుంటాడో అడ్రస్ చెబితే, తాను అంతకంటే ఎక్కువే చావకొడతానని వ్యాఖ్యానించాడు. అబద్ధం చెప్పొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో 30 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కుమారుడ్ని దారుణంగా కొట్టడమే కాకుండా, భార్యతో వీడియో తీయించిన విషయం విదితమే.

అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన సుధీర్ బాబు, ‘‘దయచేసి ఆ తండ్రి ఎక్కడున్నాడో కనుక్కోండి. అతన్ని ఇంకా ఎక్కువే కొడతాను. అతన్ని ఓ తండ్రిగా పిలవడానికే సిగ్గుగా ఉంది’’ అంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బాలుడ్ని తండ్రి కొట్టిన దృశ్యాల వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

boy beaten by father
bangalore
actor
sudheerbabu
  • Loading...

More Telugu News