mp jc diwakar reddy: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

  • ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయిన జేసీ
  • వెంటనే ఆసుపత్రికి తరలించిన భద్రతా సిబ్బంది
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  ఈరోజు నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమరావతికి వచ్చారు. ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది జేసీని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ, జేసీ బీపీ, షుగర్ లెవెల్స్ బాగానే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా జేసీకి వైద్యులు సూచించినట్టు సమాచారం.

mp jc diwakar reddy
Telugudesam
amaravathi
  • Loading...

More Telugu News