indians: గతేడాది దేశాన్ని వీడిన 7,000 మంది కోటీశ్వరులు... చైనా నుంచి 10,000
- ఏటేటా పెరుగుతున్న వలసలు
- న్యూవరల్డ్ వెల్త్ రిపోర్టులో వెలుగు చూసిన విషయలు
మిలియనీర్ల (10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వారు) వలసల విషయంలో భారత్ ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. గతేడాది 7,000 మంది మిలియనీర్లు దేశాన్ని విడిచిపెట్టి పరాయిదేశానికి తరలిపోయారు. అంతకుముందు సంవత్సరం కంటే వలసలు 16 శాతం పెరిగాయి. న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
2016లో మన దేశం నుంచి వెళ్లిన మిలియనీర్ల సంఖ్య 6,000. 2015లో 4,000 మంది ఇలా విదేశాలకు వలసపోయారు. ఇక చైనా నుంచి గతేడాది 10,000 మంది వలసపోవడం గమనార్హం. టర్కీ నుంచి 6,000 మంది, బ్రిటన్ నుంచి 4,000 మంది, ఫ్రాన్స్ నుంచి 4,000 మంది, రష్యా నుంచి 3,000 మంది విదేశాలకు తరలిపోయారు.