Mexico: ఆనందపు అంచులను చూసిన ఉద్వేగంలో.. గుండె ఆగి మరణించిన 16 ఏళ్ల యువతి!

  • ఫ్రెండ్స్ తో కలసి బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన యువతి
  • ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకున్న లానా హేమన్
  • ఆనందిస్తూనే ఉద్వేగంతో కన్నుమూత
  • మెక్సికోలో ఘటన

తన స్నేహితులతో కలసి విహారయాత్ర నిమిత్తం బీచ్ కు వెళ్లిన 16 ఏళ్ల యువతి, ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ కారణంగా మరణించడం కలకలం రేపింది. ఆమె గుండెపోటుతో మరణించిందని పోస్టుమార్టం నివేదిక రాగా, 16 ఏళ్ల అమ్మాయికి గుండెపోటు రావడం ఏంటన్న కోణంలో పోలీసుల విచారణ మొదలైంది. విచారణలో భాగంగా స్నేహితులను ప్రశ్నించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

మెక్సికోకు చెందిన లానా హేమన్ అనే యువతి, ఫ్రెండ్స్ తోకలసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో వారు ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకుని మరీ ఆనందించారు. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు లానా చాలా ఆనందంగా ఉందని, అదే విషయాన్ని తమకు వెల్లడించిందని చెప్పారట. ఆ యాంగ్జయిటీలోనే ఆమె కుప్పకూలి క్షణాల్లో మరణించిందని తేల్చారు. లానా చాలా ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుందని, శరీరంలో కెఫిన్ చాలా అధికంగా చేరడం వల్లే గుండె పోటు వచ్చిందని డాక్టర్లు తేల్చారు.

Mexico
Lana Heman
Excitment
kefin
  • Loading...

More Telugu News