India: భారత యువకులకు వీసాలిచ్చి మరీ తీసుకెళ్లి ఉగ్రశిక్షణ: పాక్ నిర్వాకాలపై సాక్ష్యాలు!

  • వాఘా సరిహద్దుల ద్వారా వెళ్లిన యువకులు
  • కంచె దాటి ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్ట్
  • వారి వద్ద చెల్లుబాటులో ఉన్న పాక్ వీసాలు
  • పాక్ హై కమిషన్ వైఖరిపై భారత్ మండిపాటు

కాశ్మీర్ లో ఎంపిక చేసిన యువకులకు వీసాలను మంజూరు చేసి, వారిని తమ దేశానికి తీసుకు వెళుతున్న పాకిస్థాన్, వారికి ఇస్లామాబాద్ సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపుల్లో ఆయుధాలను వాడటంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి తిరిగి వెనక్కు పంపుతోంది. ఈ విషయంలో ఆధారాలు సంపాదించినట్టు జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్పీ వైద్ మీడియాకు వెల్లడించారు.

పాక్ వైపు నుంచి సరిహద్దులు దాటి వస్తున్న ఇద్దరు కాశ్మీర్ యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిద్దరి వద్దా చెల్లుబాటులో ఉన్న పాక్ వీసాలు లభ్యమయ్యాయని తెలిపారు. వీరు పంజాబ్ లోని వాఘా సరిహద్దుల గుండా పాక్ లోకి ప్రవేశించారని, అక్కడ ఉగ్ర శిక్షణ పొంది వచ్చారని తెలిపారు. భారత యువకులకు పాక్ ఉగ్ర శిక్షణ ఇస్తోందని తెలిపిన ఆయన, పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంపై మండిపడ్డారు.

అరెస్ట్ చేసిన వారిని అబ్దుల్ మాజీద్ భట్, మొహమ్మద్ అష్రాఫ్ మీర్ లుగా గుర్తించామని, వీరు బారాముల్లా జిల్లా పరిధిలోని కీరి, పట్టాన్ ప్రాంతాలకు చెందిన వారని అన్నారు. వీరిద్దరినీ విచారించగా, పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అక్కడ ఎంతో మంది యువకులు ఆయుధ శిక్షణ పొందుతున్నట్టు వీరు చెప్పారని, పదేళ్ల వయసున్న బాలలు కూడా టెర్రరిస్టు క్యాంపుల్లో ఉన్నారని వారు చెప్పినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News