India: ఆటో ప్రయాణం కంటే విమాన ప్రయాణమే చౌక: ఉదాహరణతో సహా చెప్పిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా

  • ఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
  • పాల్గొని ప్రసంగించిన కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా
  • ఇండోర్, ఢిల్లీ మధ్య కి.మీ.కు రూ. 5తోనే ప్రయాణమన్న కేంద్ర మంత్రి

ఇండియాలో ఆటోలో ఎక్కి ప్రయాణం చేయడం కంటే విమానంలో వెళ్లడమే చౌకని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. ఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ లో ఆయన మాట్లాడుతూ, తానేమీ అర్థం లేకుండా మాట్లాడటం లేదని, ఇండియాలో ఆటో ప్రయాణం కన్నా విమాన ప్రయాణం తక్కువకే సాధ్యమని ఉదాహరణను చెప్పారు. ఢిల్లీ నుంచి ఇండోర్ కు సుమారు 900 కిలోమీటర్ల దూరం ఉండగా, విమానంలో వెళ్లాలంటే కిలోమీటరుకు రూ. 5 వరకూ అవుతుందని, అదే దూరాన్ని ఆటోలో వెళ్లాలంటే రూ. 10 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇండియాలో విమానయానం మరింత చౌకగా మారనుందని కూడా జయంత్ సిన్హా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News