ship hijak: మాయమైన భారతీయ షిప్... షిప్ లో గ్యాసోలిన్!
- రెండు రోజుల క్రితం మాయమైన భారత్ షిప్
- షిప్ లో 52 కోట్ల విలువ చేసే గ్యాసోలిన్
- షిప్ లో 22 మంది సెయిలర్స్
భారత్ కు చెందిన షిప్ ఒకటి సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. గత 48 గంటలుగా నౌకకు సంబంధించిన ఎలాంటి సమాచారము అందలేదు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్ ప్రెస్ కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఓడలో 52 కోట్ల రూపాయల విలువైన గ్యాసోలిన్ ఉంది. షిప్ లో 22 మంది సెయిలర్స్ ఉన్నారు.
కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో ఒక భారతీయనౌక హైజాక్ కు గురైందని అధికారులు చెబుతున్నారు. గ్యాసోలిన్ ను చోరీ చేసేందుకే షిప్ ను హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హైజాక్ కు గురైన షిప్ కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత తీరరక్షక దళం గాలింపు చేపట్టింది.