shraddha kapoor: పెళ్లి పూర్తిగా ప్రభాస్ సొంత విషయం: శ్రద్ధాకపూర్

  • ప్రభాస్ అద్భుతమైన వ్యక్తి
  • 'సాహో'ను ఒప్పుకోకపోతే ఒక మంచి మిత్రుడిని కోల్పోయేదాన్ని
  • ప్రభాస్ పెళ్లి గురించి ఆయనే చెప్పాలి

దక్షిణాదిలో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ బాగా పాప్యులర్ అయిపోయింది. దీనికి కారణం 'సాహో' సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తుండటమే. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను శ్రద్ధాకపూర్ పంచుకుంది.

 'సాహో' సినిమాను ఒప్పుకోకపోతే ఓ మంచి సినిమానే కాదు, ప్రభాస్ లాంటి మంచి స్నేహితుడిని కూడా కోల్పోయేదాన్నని చెప్పింది. తాను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడని తెలిపింది. తాను, ప్రభాస్ ఎక్కువగా కెరీర్ కు సంబంధించిన విషయాలే మాట్లాడుకునేవారమని, వ్యక్తిగత విషయాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పింది. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించగా... పెళ్లి అనేది పూర్తిగా ప్రభాస్ సొంత విషయమని... తమ మధ్య ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదని తెలిపింది. దీనికి సమాధానం ప్రభాస్ మాత్రమే చెప్పగలడని చెప్పింది. 

shraddha kapoor
Prabhas
saho film
prabhas marriage
  • Loading...

More Telugu News