Tollywood: మా అమ్మ ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డలా చేరదీసింది: రాజీవ్ కనకాల

  • సంపూర్ణమైన జీవితం అనుభవించింది
  • నట శిక్షకురాలిగా ఎంతో మందికి ఆమె మార్గదర్శకురాలు
  • నిన్నటి వరకూ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా పని చేసింది: రాజీవ్ కనకాల

సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల ఈరోజు మృతి చెందారు. తన తల్లి గురించి ప్రముఖ సినీనటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరినీ తన కన్నబిడ్డల్లా తన తల్లి చేరదీసిందని అన్నాడు. ఆమెది సంపూర్ణమైన జీవితమని, నట శిక్షకురాలిగా ఎంతో మందికి ఆమె మార్గదర్శిగా నిలిచారని అన్నాడు. ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ గా నిన్నటి వరకూ ఆమె బాధ్యతలు నిర్వర్తించారని చెప్పాడు. అనంతరం, ప్రముఖ యాంకర్, రాజీవ్ కనకాల భార్య సుమ మాట్లాడుతూ, తనను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నారని చెప్పింది.

Tollywood
rajiv kanakala
anchor suma
  • Loading...

More Telugu News