Cricket: అర్ధ సెంచరీతో సత్తాచాటిన మంజోత్ కల్రా... రెండు వికెట్లు కోల్పోయిన భారత్

  • శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు
  • అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మంజోత్ కల్రా 
  • కెప్టెన్ పృథ్వీ షా, కీలక బ్యాట్స్ మన్ శుభ్ మన్ గిల్ అవుట్

భారత్ అండర్-19 ఆటగాళ్లు బ్యాటింగ్ లో కూడా రాణించి ఆకట్టుకుంటున్నారు. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీ షా, మంజోత్ కల్రా శుభారంభం ఇచ్చారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కెప్టెన్ పృథ్వీ షా ఆసీస్ బౌలర్ సంధించిన బంతికి బౌల్డయ్యాడు.

అనంతరం శుభ్ మన్ గిల్ (28)తో జతకట్టిన మంజోత్ (61) ధాటిగా ఆడుతూ, అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో భారత్ స్కోరును సెంచరీ దాటించారు. వీరిద్దరూ కేవలం 47 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్న వీరిద్దరూ చెత్తబంతులను బౌండరీ లైన్ దాటిస్తూ భారత ఇన్నింగ్స్ కు స్థిరత్వం తెచ్చారు.

దీంతో 21 ఓవర్లకు భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. అయితే, 22వ ఓవర్ రెండో బంతికి టొర్నీలో అత్యధిక పరుగుల వీరుడు శుభ్ మన్ గిల్ (31) ఉప్పల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. దీంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 

  • Loading...

More Telugu News