Nara Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ సంసిద్ధత!
- ఏపీకి వస్తున్న కార్డ్ లీటిక్స్ సంస్థ
- విశాఖలో త్వరలోనే కార్యకలాపాలు
- ఫైనాన్షియల్, సర్వీసెస్ అందిస్తున్న కార్డ్ లీటిక్స్
ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో చేపట్టిన ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో సానుకూల ఫలితాలనే ఇస్తోంది. ప్రస్తుతం అట్లాంటాలో ఉన్న ఆయన అక్కడి కార్డ్ లీటిక్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కార్డ్ లీటిక్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే 100 మంది ఉద్యోగులతో విశాఖపట్నంలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు.