honour killing: మతం పిచ్చి... కూతురి ప్రియుడిని గొంతు కోసి చంపిన వ్యక్తి!

  • ఢిల్లీలోని రఘువీర్ నగర్ లో దారుణం
  • ప్రేమను తెంచుకొమ్మని హెచ్చరించిన యువతి తండ్రి
  • కుమార్తె ప్రియుడిపై దాడిచేసి, గొంతు కోసిన తండ్రి

ఇతర మతస్తుడన్న కారణంతో కుమార్తె ప్రియుడ్ని గొంతుకోసి చంపిన ఘటన న్యూఢిల్లీలో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిమ్ యువతి (20), అదే ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న అంకిత్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువకుడి మతం వేరు కావడంతో వారి ప్రేమను యువతి తండ్రి వ్యతిరేకించాడు.

అయినప్పటికీ వారి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్చరించిన యువతి తండ్రి, అంకిత్ పై దాడి చేసి, అతని గొంతు కోసి చంపాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

honour killing
lover murdered
religion murder
  • Loading...

More Telugu News