Deepa: శశికళ వర్గీయులు నన్ను చంపేస్తామంటున్నారు.. పోలీసులను ఆశ్రయించిన దీప

  • సోషల్ మీడియా వేదికగా శశికళ, దినకరన్ వర్గాల నుంచి బెదిరింపులు
  • చంపేస్తామంటూ ఫోన్లు
  • కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జయ మేనకోడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఎమ్మెల్యే దినకరన్ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారిద్దరి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఆమె మీడియాతో  మాట్లాడుతూ గత కొంతకాలంగా తనకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా బెదిరింపులు వస్తున్నట్టు చెప్పారు. తనను హత్య చేస్తామంటూ వస్తున్న బెదిరింపులపై గతంలోనే పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు వస్తున్న బెదిరింపుల విషయంలో తన భర్తకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. తమ మధ్య రాజకీయ వైరుధ్యమే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవన్నారు. ప్రస్తుతం తాము కలిసే ఉన్నట్టు చెప్పారు.

Deepa
Jayalalitha
Tamilnadu
shasikala
Dinakaran
  • Loading...

More Telugu News