TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ఘటన!

  • ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఎమ్మెల్యే కారు
  • దెబ్బతిన్న కారు ముందు భాగం
  • మరో కారులో వెళ్లిపోయిన శంకర్ నాయక్

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే తిరిగి వస్తుండగా పస్రా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. శంకర్ నాయక్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

కాగా, మేడారం మహా జాతర నాలుగో రోజు ఘనంగా కొనసాగుతోంది. జాతరకు నేడు ఆఖరు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. పూజల అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

TRS
MLA
Shankar Naik
Medaram
  • Loading...

More Telugu News