nara brahmani: 'బాగుంది'.. కేంద్ర బడ్జెట్‌పై నారా బ్రాహ్మణి స్పందన

  • బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయి
  • ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామం
  • కిసాన్ కార్డులు ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు కూడా ఇవ్వనున్నారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పందించారు. విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని కితాబిచ్చారు.

ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు. 

nara brahmani
Andhra Pradesh
heritage
Union Budget 2018-19
  • Loading...

More Telugu News