Telangana: గవర్నర్ ను కలిసిన మంత్రి కేటీఆర్

  • రాజ్ భవన్ లో నరసింహన్ ని కలిసిన కేటీఆర్
  • దావోస్ సదస్సు, జపాన్, కొరియా, దుబాయ్ దేశాల్లో పర్యటనా విశేషాల ప్రస్తావన
  • తెలంగాణలో పెట్టుబడులకు విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చించానన్న కేటీఆర్

గవర్నర్ నరసింహన్ ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన్ని కలిశారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇటీవల పాల్గొన్న కేటీఆర్ తన పర్యటన గురించి ఆయనకు వివరించారు. కాగా, జనవరి 14 నుంచి 27 వరకు విదేశాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జనవరి 23 నుంచి 26 వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఇంకా జపాన్, కొరియా, దుబాయ్ దేశాల్లో పర్యటించిన కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై అక్కడి ప్రతినిధులకు వివరించారు.

Telangana
governor
KTR
  • Loading...

More Telugu News