vangaveeti radha krishna: వంగవీటి రాధతో కలసి పనిచేస్తా: గౌతంరెడ్డి

  • సస్పెన్షన్ ఆర్డర్ అందలేదు
  • విజయవాడ సెంట్రల్ టికెట్ రాధాకే అని జగన్ చెప్పారు
  • రాధాతో కలసి పని చేస్తా

విజయవాడ వైసీపీ నేతలు వంగవీటి రాధా, గౌతంరెడ్డిల మద్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా, వైసీపీని రాధా వీడుతున్నట్టు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో, గౌతంరెడ్డి స్పందించారు. వైసీపీ నుంచి తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందనేలేదని చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటు రాధాకే అని తనకు జగన్ చెప్పారని... రాధాతో కలసి తాను పని చేస్తానని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ను గౌతంరెడ్డి ఇటీవలే కలిశారు.

vangaveeti radha krishna
gowtham reddy
jagan
YSRCP
Vijayawada
  • Loading...

More Telugu News