Kajal Agarwal: 'అక్కా... ఐ లవ్ యూ' అంటూ నలుగురి ముందూ షాకిచ్చిన అభిమానిపై కాజల్ అగర్వాల్ స్పందన ఇది!
- సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న కాజల్
- అభిమానులతో మాట్లాడించిన చిత్ర యూనిట్
- 'అక్కా' అంటూ, 'ఐ లవ్ యూ' ఎలా చెబుతావ్?
- అభిమానిని ప్రశ్నించిన కాజల్
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దాదాపు పదేళ్ల నుంచి వెలుగుతున్న కాజల్ అగర్వాల్, ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి హాజరు కాగా, ఓ అభిమాని షాకిచ్చాడు. కాజల్ తో మాట్లాడే అవకాశాన్ని కొంతమంది అభిమానులకు చిత్ర యూనిట్ కల్పించిన వేళ ఈ ఘటన జరిగింది.
ఓ ఫ్యాన్ కాజల్ ను ఉద్దేశించి 'అక్కా' అని సంబోధించాడు. కాజల్ సహా అక్కడున్న వాళ్లు షాక్ లో ఉండగానే 'ఐ లవ్ యూ' అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన కాజల్ ఓ వైపు 'అక్కా' అంటూ, మరోవైపు 'ఐ లవ్ యూ' ఎలా చెబుతావని కాజల్ అడుగగా, అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి. నాని నిర్మిస్తున్న 'అ' సినిమాలో కాజల్ కూడా ఓ పాత్ర చేయగా, ఆ సినిమా ఈవెంట్ లోనే ఈ ఘటన జరిగింది.