rajasekhar: రాజశేఖర్ కొత్త సినిమాలు .. పుట్టినరోజున ప్రకటన!

  •  ఈ నెల 4వ తేదీన రాజశేఖర్ పుట్టినరోజు 
  • ఆ రోజున తన కొత్త ప్రాజెక్టులపై ప్రకటన 
  • ఈ ఏడాది రెండు సినిమాలు చేయనున్న రాజశేఖర్

చాలాకాలం తరువాత 'గరుడవేగ' సినిమాతో రాజశేఖర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నుంచి గ్యాప్ లేకుండగా వరుస సినిమాలు చేస్తూ వెళతానని ఆ సమయంలోనే ఆయన చెప్పారు. అన్నట్టుగానే ఆయన రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుని .. దర్శకులను రంగంలోకి దింపేశారని అంటున్నారు.

ఈ నెల 4వ తేదీన రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజున ఆయన తన తదుపరి సినిమాలను గురించిన ప్రకటన చేస్తారట. రెండు సినిమాలను ఏ బ్యానర్లో చేయనున్నారు .. ఎవరు దర్శకత్వం వహించనున్నారు .. నటీనటులు .. సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాన్ని ఆ రోజున ఆయన వెల్లడిస్తారని అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక దాంట్లో ఆయన కూతురు శివాని ఒక యువ హీరో జోడీగా కనిపించనుండటం విశేషం. మొత్తానికి ఈ ఏడాది రాజశేఖర్ రెండు సినిమాలతో పలకరిస్తారన్న మాట.    

  • Loading...

More Telugu News