Congress: 'సేవ్ ఆంధ్రప్రదేశ్'... రాజ్యసభలో కేవీపీ నినాదాలు!

  • పోడియంలోకి దూసుకెళ్లిన కేవీపీ
  • తోడుగా వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు
  • రాజ్యసభలో తీవ్ర గందరగోళం
  • సభను వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఈ ఉదయం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలియజేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 'సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ పోడియంలో నినాదాలు చేశారు. ప్లకార్డును ప్రదర్శించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు గొంతెత్తడంతో, డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రశాంతంగా ఉండాలని పదేపదే కోరాల్సి వచ్చింది. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

Congress
KVP Ramachandra Rao
Parliament
Rajyasabha
  • Loading...

More Telugu News