Jagan: పాదయాత్రకు బ్రేక్.. కోర్టుకు హాజరైన జగన్

  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్
  • ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర
  • తిరిగి రేపు మరువూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు

అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసీపీ అధినేత జగన్ నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సిందే అంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు వచ్చారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా కోర్టుకు సెలవు ఉండటంతో... జగన్ కోర్టుకు రాలేదు. తిరిగి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.

జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 77వ రోజున పొదలకూరు నుంచి నెల్లూరు జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు విచారణ అనంతరం... తిరిగి రేపు మరువూరు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతుంది.

Jagan
YSRCP
cbi court
  • Loading...

More Telugu News