charan: చరణ్ సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ తో వున్న బోయపాటి

  • చరణ్ తో బోయపాటి 
  • జూన్ నాటికి పూర్తి చేయాలనే ఆలోచన 
  • జూలైలో విడుదల చేయాలనే నిర్ణయం  

కథపై బాగా కసరత్తు చేసే దర్శకులలో బోయపాటి శ్రీను ముందువరుసలో కనిపిస్తాడు. బౌండ్ స్క్రిప్ట్ తో ఒకసారి సెట్స్ పైకి వెళ్లాడు అంటే .. ఎక్కడా ఆలస్యం కాకుండా అనుకున్న సమయానికి షెడ్యూల్స్ ను పూర్తిచేస్తుంటాడు. అలాగే చరణ్ సినిమా విషయంలోను ఆయన పక్కా ప్లానింగ్ తో వున్నాడని అంటున్నారు. చరణ్ బిజీగా ఉండటంతో .. ఆయన పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలతో అప్పుడే బోయపాటి ఒక షెడ్యూల్ ను పూర్తి చేశాడు.

 చరణ్ తో వచ్చేవారం రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. చరణ్ పనులను బట్టి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్న బోయపాటి, జూన్ చివరినాటికి అన్ని పనులను పూర్తి చేసి, జూలైలో విడుదల చేయాలనే ఆలోచనతో వున్నాడని చెబుతున్నారు. ఈ విధంగా చకచకా షూటింగ్ చేయడం వలన, 'రంగస్థలం' తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే బోయపాటితో చరణ్ సినిమా వచ్చేస్తుందని అంటున్నారు

charan
boyapati
  • Loading...

More Telugu News