sourav ganguly: గంగూలీ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో కోహ్లీ!
- విదేశీ గడ్డపై కెప్టెన్ గా 11 వన్టే సెంచరీలు
- గంగూలీ రికార్డు సమం
- మరో సెంచరీ చేస్తే రికార్డు బద్దలు
మరో ఘనతను సాధించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ... విదేశీ గడ్డపై కెప్టెన్ గా 11వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరసన చేరాడు. మరో సెంచరీ కొడితే... విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు (వన్డేల్లో) చేసిన భారత కెప్టెన్ గా రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు. విదేశాల్లో కెప్టెన్ హోదాలో 11 సెంచరీలు చేయడానికి గంగూలీకి 142 ఇన్నింగ్స్ పడితే, కోహ్లీ 41 ఇన్నింగ్స్ లలోనే ఆ ఘనతను సాధించాడు.
నిన్నటి సెంచరీతో కోహ్లీ వన్డే సెంచరీల సంఖ్య 33కు చేరుకుంది. ఇందులో 20 సెంచరీలు ఛేజింగ్ లో చేసినవి కావడం గమనార్హం. ఆ 20 సెంచరీలు టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చడం విశేషం. కెరీర్ మొత్తమ్మీద విదేశీ గడ్డపై కోహ్లీ 15 సెంచరీలు చేశాడు. నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ 119 బంతుల్లో 112 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. దీంతో, ఆరు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.