gurmeet ram raheem singh: 400 మంది అనుచరులను నపుంసకులుగా మార్చడంపై గుర్మీత్ పై ఛార్జిషీట్ నమోదు
- అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీం సింగ్
- 400 మంది అనుచరులను నపుంసకులుగా మార్చిన గుర్మీత్ రామ్ రహీం సింగ్
- నపుంసకులుగా మార్చేందుకు సహకరించిన ఇద్దరు డాక్టర్లపై కూడా అభియోగాలు
ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సిర్సా జైలులో 20 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, తన 400 మంది అనుచరులను బలవంతంగా నపుంసకులుగా మార్చడంపై పంచకుల న్యాయస్ధానంలో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. వారిని నపుంసకులుగా మార్చేందుకు సహకరించిన ఇద్దరు వైద్యుల పేర్లను కూడా సీబీఐ ఈ ఛార్జిషీటులో చేర్చింది.
కాగా, సిర్సాలోని ఆశ్రమంలో గుర్మీత్ రామ్ రహీం సింగ్ చేసిన అకృత్యాలపై నిజాలు నిగ్గుతేల్చాలని పంజాబ్, హర్యణా హైకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. న్యాయ స్థానం ఆదేశాలకు దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు.