bhagamathi: మీ సినిమా చూసి నా భార్య నిద్రపోలేదండీ బాబూ!: రామ్ చరణ్

  • భాగమతి చిత్ర బృందాన్ని ప్రశంసించిన రాంచరణ్ తేజ్
  • అనుష్క నటన మైండ్ బ్లోయింగ్
  • ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ అదిరిపోయాయి

తన భార్య రాత్రంతా నిద్రపోలేదని రాంచరణ్ తేజ్ తెలిపాడు. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ‘భాగమతి’ సినిమా చూశానని, సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ తన ఫేస్ బుక్ పేజ్ లో ఒక పోస్టు పెట్టాడు.

ఈ సందర్భంగా ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ, ‘‘రాత్రి ‘భాగమతి’ సినిమా చూశాను. మైండ్ బ్లోయింగ్ నటనతో అనుష్క ఆకట్టుకుంది. టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. భాగమతి టీమ్ గురించి చెప్పాలంటే.. కేక. టీమ్ అంతా చాలా కష్టపడింది. వారందరికీ శుభాకాంక్షలు. ‘భాగమతి’ సినిమా చూసిన తర్వాత భయంతో నా భార్య రాత్రి నిద్రకూడా పోలేదు’’ అని రాంచరణ్ తేజ్ తెలిపాడు.

దీనికి ఆ చిత్ర  బృందం వెంటనే స్పందిస్తూ, ‘‘జనాలను నిద్రపోనివ్వకూడదనే మా లక్ష్యం నెరవేరింది. థ్యాంక్యూ రామ్ చరణ్ గారు, మా కష్టాన్ని గుర్తించినందుకు’’ అంటూ ధన్యవాదాలు తెలిపింది.      

bhagamathi
ramcharan
movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News