medaram: మేడారంలో తెలంగాణ మంత్రులు.. చిత్రమాలిక!

  • వనదేవతలను సందర్శించిన మంత్రులు
  • అక్కడి వసతులపై భక్తులను ఆరా తీసిన నేతలు
  • ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు వచ్చారన్న కడియం

మేడారం జాతర రెండో రోజున అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరుకుంది. జిల్లా అధికార యంత్రాంగం సమ్మక్కకు ఘనస్వాగతం పలికారు. ఆనవాయతీ ప్రకారం జిల్లా ఎస్పీ భాస్కరన్ గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు, ఈ రోజు ఉదయం పూజారి ఇంటి నుంచి పూజా సామగ్రితో అమ్మవారి మందిరానికి తరలి వెళ్లిన అనంతరం, ఆడబిడ్డలు గద్దెకు ముగ్గులు వేసి తిరిగి వచ్చారు.

సాయంత్రం భారీ బందోబస్తుతో పూజారులు చిలుకలగుట్టకు చేరుకుని వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం జాతరకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవార్లను దర్శించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, మేడారం జాతరకు ఇప్పటికే యాభై లక్షల మంది భక్తులు హాజరయ్యారని, వచ్చే మూడు రోజుల్లో భక్తుల సంఖ్య పెరగనుందని అన్నారు. భక్తులకు తగిన వసతులు కల్పించామని చెప్పారు. మేడారంలో మంత్రుల పర్యటనకు సంబంధించిన దృశ్యాలు.. 

medaram
Telangana
Kadiam Srihari
indarkaran redddy
TRS
  • Loading...

More Telugu News