budget: కేంద్ర బడ్జెట్ తో ఎవరెవరికి లాభం?

  • రైతులు, గ్రామీణ ప్రాంతాలపై బడ్జెట్లో వరాలు
  • మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లనున్న నిధులు
  • వీటితో ముడిపడిన రంగాలకు చేకూరనున్న లబ్ధి

చాలా మంది ఊహించనట్టుగానే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపొందింది. గ్రామీణ ప్రాంతాల్లో వసతులను మెరుగుపరచడం, రైతుల సంక్షేమం, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ఎక్కువగా ఆర్థిక మంత్రి జైట్లీ ఫోకస్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది రైతులు, గ్రామీణ ప్రజలు, వ్యవసాయానికి సంబంధించిన రంగాలకు చెందిన బడ్జెట్ గా దీన్ని చెప్పుకోవచ్చు.

బడ్జెట్ ద్వారా ఎవరు లబ్ధి పొందారు?


రైతులు:
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను బడ్జెట్ లో పెంచారు.
దీంతో, దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలోకి నిధులు పెరగనున్నాయి.
కేంద్ర నిర్ణయంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆక్వా ప్రాజెక్టులు, సోలార్ పవర్ పంపులు, అగ్రి కంపెనీలకు లబ్ధి.
శక్తి పంప్స్, జైన్ ఇరిగేషన్, కేఎస్బీ పంప్స్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్, జేకే అగ్రి, తదితర కంపెలనీలకు బెనెఫిట్.

హెల్త్ కేర్:
'నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్' కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కేంద్రం, 50 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా 10 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనుంది. దీని వల్ల అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ వంటి సంస్థలకు లాభం.

ట్రాన్స్ పోర్ట్:
రోడ్స్, రైల్వేస్, నిర్మాణరంగం, ఇంజినీరింగ్, రైలు వ్యాగన్ల తయారీలపై ఎక్కువ ఖర్చు చేయనున్నట్టు ప్రటించిన జైట్లీ. దీంతో, ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ కన్స్ స్ట్రక్షన్, ఎన్సీసీ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రా, దిలీప్ బిల్డ్ కాన్, సిమ్కో లిమిటెడ్ తదితర కంపెనీలకు లబ్ధి.

కన్జ్యూమర్ కంపెనీలు:
మారుమూల ప్రాంతాలకు కూడా నిధులు వెళ్లనున్న నేపథ్యంలో, కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీంతో కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మరీకో లిమిటెడ్ లాంటి కంపెనీలు లాభపడనున్నాయి. ఇదే సమయంలో వాహన తయారీ కంపెనీలు హీరో, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి సంస్థలకు కూడా లబ్ధి చేకూరనుంది.

జ్యువెలరీ:
మన దేశంలో జ్యువెలరీకి సంబంధించిన 60 శాతం ఆదాయం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. దీంతో, టైటాన్, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ, పీసీ జ్యువెలర్స్ వంటి సంస్థలకు లబ్ధి చేకూరనుంది.

ఎయిర్ పోర్ట్స్:
దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే దిశగా బడ్జెట్ ఉన్న నేపథ్యంలో, జీఎంఆర్ ఇన్ఫ్రా, జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా లాంటి కంపెనీలు లాభపడనున్నాయి.

  • Loading...

More Telugu News