Fake news circulating: జీఎస్టీ సినిమాపై ఫేక్ వార్తలు.. వివరణ ఇచ్చిన రామ్‌గోపాల్ వర్మ
- 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమాను భారత్‌లో తొలగించారంటూ వార్తలు
- అది ఫేక్ న్యూస్- వర్మ
- విమియో వెబ్ నుంచి మాత్రమే తొలగించారు
- నిర్మాతలకు చెందిన వెబ్‌లో ఆ సినిమా ఉంది
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ షార్ట్ ఫిల్మ్‌ను భారత్‌లో నిలిపివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. అది ఫేక్ న్యూస్ అని తెలిపారు. కాపీరైట్ చర్యల్లో భాగంగా విమియో వెబ్ నుంచి మాత్రమే స్ట్రయిక్ ఫోర్స్ ఎల్‌ఎల్‌సీ నిర్మాతలు జీఎస్టీ షార్ట్ ఫిల్మ్‌ను తొలగించారని తెలిపారు. కాగా, ఈ సినిమా నిర్మాతలకు చెందిన అధికారిక వెబ్ సైట్ GodSexTruthMovie.comలో మాత్రం తమ జీఎస్టీ వీడియో అలాగే ఉందని వివరణ ఇచ్చారు.