Narendra Modi: 'బడ్జెట్'పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన

  • దేశంలో రేపటి తరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట
  • రైతులు, దళితులు, గిరిజన వర్గాలకు ఈ బడ్జెట్ లాభదాయకం
  • సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు సైతం ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది
  • ఈ బడ్జెట్‌తో జీవిత విధానం మరింత సరళంగా మారుతుంది

ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతు హిత బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలోని రైతులు, దళితులు, గిరిజన వర్గాలకు ఈ బడ్జెట్ లాభదాయకమని చెప్పారు. అన్ని తరహా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని, ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు సైతం ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని, ఈ బడ్జెట్‌తో జీవిత విధానం మరింత సరళంగా మారుతుందని పేర్కొన్నారు.

అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించి ప్రకటించామని నరేంద్ర మోదీ తెలిపారు. సహకార వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదక సంఘాల సేవలు విస్తృతం అవుతాయని తెలిపారు. దేశంలో రేపటి తరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని చెప్పారు. 

  • Loading...

More Telugu News