union budget: 24 కొత్త మెడికల్ కాలేజీలు.. జిల్లా ఆసుపత్రుల ఆధునీకరణ: జైట్లీ బడ్జెట్

  • రూ. లక్ష కోట్ల కేటాయింపు
  • టెక్నాలజీని పెంచుతాం
  • బ్లాక్ బోర్డులను డిజిటల్ బోర్డులుగా మారుస్తాం

వైద్యుల సంఖ్యను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, కొత్తగా 24 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి తోడు జిల్లా ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. విద్యాసంస్థల వసతులను మెరుగుపరిచేందుకు, దేశ వ్యాప్తంగా టెక్నాలజీని పెంచేందుకు రూ. లక్ష కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.

ఉపాధ్యాయలకు శిక్షణ ఇవ్వడం, ట్రైబల్ విద్యార్థుల స్కూళ్ల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తామని జైట్లీ చెప్పారు. కనీసం 20 వేల మంది గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో, జనాభాలో 50 శాతానికి మించి ఎస్టీలు ఉండే ప్రాంతాల్లో 'ఏకలవ్య' స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నవోదయా విద్యాలయాలతో కలసి ఇవి పని చేస్తాయని చెప్పారు. విద్యాసంస్థల్లో డిజిటల్ టెక్నాలజీని పెంచుతామని... బ్లాక్ బోర్డులను క్రమంగా డిజిటల్ బోర్డులుగా మార్చుతామని జైట్లీ తెలిపారు. 

  • Loading...

More Telugu News