bhoot banglow movie: అమీర్ పేట విద్యార్ధులు, పోలీస్ బాస్ లు వ్యభిచారులేనన్న వ్యాఖ్యలపై దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు

  • 'భూత్ బంగ్లా' సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్య
  • సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు
  • ఆయన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన జిన్నెల సురేఖ పోలీసులకు ఫిర్యాదు

వివిధ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు హైదరాబాదులోని అమీర్ పేటకు వచ్చిన విద్యార్ధులు, కొందరు పోలీస్ బాస్ లు వ్యభిచారులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన 'భూత్ బంగ్లా' సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జనవరి 26న ఫిల్మ్ ఛాంబర్ లో 'భూత్‌ బంగ్లా' సినిమా ప్రమోషన్ నిర్వహించిన దర్శకుడు అజయ్‌ కౌండిన్య చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని మల్కాజ్‌ గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఫంక్షన్ లో మహిళల మనోభావాలు గాయపరిచేలా అజయ్ మాట్లాడారని, ఆ తరువాత ఈ నెల 30న ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో తన వ్యాఖ్యలు నిరూపిస్తానని సమర్ధించుకుంటూ సవాల్ విసిరాడని ఆమె అన్నారు. అమీర్ పేట విద్యార్ధులు, పోలీస్ బాస్ లు వ్యభిచారులనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అతనిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

bhoot banglow movie
ajay koundinya
police case on director
  • Loading...

More Telugu News