badget: 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తాం... బడ్జెట్ సందర్భంగా అరుణ్ జైట్లీ ప్రకటన

  • ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం
  • త్వరలోనే ఐదో  స్థానానికి చేరుకుంటాం
  • ఎగుమతుల వృద్ధి 15 శాతం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్-2019 మార్చి) 7.2 నుంచి 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తామని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జేైట్లీ ప్రకటించారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రభావాల నుంచి దేశ అభివృద్ధిని ఎంత వేగంగా ప్రభుత్వం పట్టాలెక్కించాలనుకుంటున్నది ఈ ప్రకటనతో స్పష్టమైంది. దేశ జీడీపీ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.75 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ప్రస్తుతం ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలోనే ఐదో స్థానానికి చేరుతుందని అరుణ్ జైట్లీ అన్నారు. ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి నమోదు చేస్తాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News