budget: 18 ఏళ్లలో బడ్జెట్ 19 రెట్లు, ఆర్థిక రంగం 9 రెట్లు పెరగ్గా, వ్యక్తుల ఆదాయంలో వృద్ధి ఐదు రెట్లే!

  • అంతరాలను తెలియజేస్తున్న గణాంకాలు
  • బడ్జెట్ స్థాయిలో పెరగని తలసరి ఆదాయం
  • దేశ ఉత్పత్తిలో తగ్గిన సాగు రంగం పాత్ర

ఆర్థిక రంగం వృద్ధికి సమాంతరంగా వ్యక్తుల ఆదాయ స్థాయి పెరగడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. 1991 నుంచి చూస్తే దేశ ఆర్థిక రంగం 9 రెట్లు పెరిగి 2.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. 1991లో దేశ జీడీపీ 266 బిలియన్ డాలర్లే.

  • నాడు జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం. ఇప్పుడు 17.4 శాతానికి క్షీణించింది. అంటే వ్యవసాయ రంగం పాత్ర కుచించుకుపోతుండగా, ఇతర రంగాల్లో అభివృద్ధి పెరిగినట్టు తెలుస్తోంది.
  • 1991లో జీడీపీలో సేవల రంగం వాటా 39 శాతం అయితే, అదిప్పుడు 54 శాతానికి చేరింది.
  • 1991లో పరిశ్రమల వాటా 30 శాతం అయితే అదిప్పుడు 29 శాతమే.
  • బడ్జెట్ సైజు 1991 నుంచి 19 రెట్లు వృద్ధి చెందింది. 2017-18లో ఇది రూ.21.47 లక్షల కోట్లు.
  • తలసరి ఆదాయంలో వృద్ది మాత్రం 5.6 రెట్లకు పరిమితం అయింది. 2016లో 1,709 డాలర్లు (సుమారు రూ.1.09 లక్షలు) అయితే, 1991లో ఇది 300 డాలర్లే.

  • Loading...

More Telugu News