srisailam: శ్రీశైలంలో బయటపడ్డ పురాతన నేలమాళిగలో ఏమేం లభించాయంటే..!

  • రుద్రాక్షమఠం జీర్ణోద్ధరణ పనుల్లో బయటపడ్డ నేలమాళిగ 
  • పలు వస్తువులు లభ్యం
  • పూజా మందిరమై ఉంటుందని భావిస్తున్న అధికారులు

శ్రీశైలంలో ఆరు అడుగుల పొడవున్న చిన్నపాటి సొరంగమార్గంతో కూడిన నేలమాళిగ నిన్న బయటపడిన సంగతి విదితమే. ఇది 3.5 అడుగులు ఎత్తు, 4.5 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంది. పురాతన రుద్రాక్షమఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా తవ్వకాలు చేపట్టగా, ఇది బయటపడింది. గది పైకప్పు రాతిబండతో ఉంది. చుట్టూ మూడు వైపులా రాతికట్టడంతో కూడిన గోడలు ఉన్నాయి. ఒక వ్యక్తి మాత్రమే దూరి వెళ్లేంత ప్రవేశ ద్వారం ఉంది. మఠాధిపతులు ఈ గదిని పూజా మందిరంగా వినియోగించి ఉంటారని భావిస్తున్నారు.

ఈ నేలమాళిగలో పలు వస్తువులు లభించాయి. 26 చెంబులు, ఒక బాండి, 2 పెద్ద గుడి గంటలు, 3 చిన్న పూజామందిర గంటలు, 5 గుండ్రటి గిన్నెలు, విరిగిన ప్లేట్లు, 2 కడియాలు, ఆరు హారతి దీపాలు, రాగి, ఇత్తడి పూజాసామాగ్రిలో రెండు బేసిన్లు, 19 ఇతరత్రా సామాన్లు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News