love: తాట తీస్తే కానీ... తాళి కట్టలేదు!

  • ప్రేమించి, సహజీవనం చేస్తున్న ప్రియుడు
  • వేరొకరితో పెళ్లికి రెడీ అయిన వైనం
  • పెద్దల సమక్షంలో దేహశుద్ధి చేసి, తాళి కట్టించుకున్న ప్రియురాలు

తనను ప్రేమించి, రహస్యంగా సహజీవనం చేస్తున్న ప్రియుడు... వేరొకరితో పెళ్లికి సిద్ధపడటంతో ఆమె శివంగిలా మారింది. ప్రియుడుని అందరిముందు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పడమే కాకుండా... అతని చేతే తాళి కట్టించుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలోని రాంభూపాల్ రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది.

కాలనీకి చెందిన దివ్యాబాయి, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ లు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో, రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో, తన అత్త కూతురును పెళ్లి చేసుకునేందుకు చంద్రశేఖర్ సిద్ధమయ్యాడు. దీంతో, నంద్యాలలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి... చంద్రశేఖర్ కు చెప్పుతో దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని పెద్దలను వేడుకుంది. దీంతో, టెక్కెలోని సుంకులమ్మ ఆలయంలో వీరిద్దరి వివాహాన్ని పెద్దలు జరిపించారు.

love
marriage
panyam
  • Loading...

More Telugu News