nagarjuna: కొత్త దర్శకుడితో అఖిల్ నెక్స్ట్ మూవీ?

  • అఖిల్ 3వ సినిమా ఆలోచనలో నాగ్ 
  • కొత్త దర్శకుడితో చేయమన్న వర్మ 
  • నాగ్ నిర్ణయంపై అభిమానుల్లో ఆసక్తి  

'అఖిల్' సినిమా అక్కినేని అభిమానులను పూర్తిగా నిరాశ పరిచింది. దాంతో రెండవ సినిమా విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా 'హలో' సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా కూడా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది. అయితే లుక్ పరంగా .. నటన పరంగా అఖిల్ మరిన్ని మార్కులు కొట్టేశాడు.

ఈ నేపథ్యంలో అఖిల్ మూడవ సినిమాను ఏ దర్శకుడితో చేయాలా అని నాగార్జున ఆలోచిస్తూ ఉండగా, ఆయనకి ఓ యువ దర్శకుడిని రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడట. ఆ దర్శకుడి ప్రతిభను గురించి నాగార్జునతో చెప్పిన వర్మ, ఆయనతో అఖిల్ 3వ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని సమాచారం. మరి ఈ విషయంలో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  

  • Loading...

More Telugu News