Arun Jaitly: బడ్జెట్ బాక్స్ తీసుకుని ప్రధాని వద్దకు బయలుదేరిన అరుణ్ జైట్లీ

  • ఉదయం 11 గంటలకు బడ్జెట్
  • 10 గంటలకు మోదీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్రం

2018-19 వార్షిక బడ్జెట్ ను ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు తేనున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, తన ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ముందుంచి ఆమోదం పొందేందుకు కదిలారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేంద్ర క్యాబినెట్, జైట్లీ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపనుంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ కు చేరాయి. పార్లమెంట్ ముందుకు వచ్చేందుకు కేవలం గంట ముందు మాత్రమే ఇవి కేంద్ర మంత్రుల చేతికి వెళతాయి.

Arun Jaitly
Narendra Modi
Budget
  • Loading...

More Telugu News