democracy: భారత ప్రజాస్వామ్యం ముప్పు ముంగిట ఉందా?
- భారత ప్రజాస్వామ్యం ముప్పుముంగిట ఉందంటున్న ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
- ఈ సూచీలో గత ఏడాది భారత్ స్థానం 32
- ఈ ఏడాది భారత్ స్థానం 42
భారత ప్రజాస్వామ్యం ముప్పుముంగిట ఉందా? అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) సర్వే అవుననే అంటోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం మేడిపండు చందమేనని ఈఐయూ సర్వే చెబుతోంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచీల్లో భారత్ స్థానం ఏటేటా దిగజారుతోందని, ఈ ఏడు అది మరింత దిగజారిందని ఆ సంస్థ తెలిపింది.
గతేడాది ఈఐయూ సూచీలో 32వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 42వ స్థానానికి దిగజారిందని తెలిపింది. దీనికి కారణం భారత్ లో సంప్రదాయ మత సిద్ధాంతాలకు ప్రాధాన్యం పెరగడంతో పాటు మైనారిటీలపై హింస పెచ్చరిల్లడం కారణమని పేర్కొంది. ఈ సూచీలో నార్వే మొదటి స్ధానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఐస్ లాండ్, స్వీడన్ లు నిలిచాయి.