Viral Videos: నడిరోడ్డుపై పడ్డ భారీ చెట్టు.. బైక్‌పై వెళుతూ ఎగిరిపడ్డ యువకుడు!

  • గాయాలతో బయటపడ్డ యువకుడు
  • సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు
  • ద‌క్షిణాచైనాలోని యులిన్ సిటీలో ఘటన

బైకుపై వేగంగా వెళుతోన్న ఓ యువ‌కుడి ముందు ఓ భారీ చెట్టు ప‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. ద‌క్షిణాచైనాలోని యులిన్ సిటీలో ఇటీవల ఓ యువకుడికి ఈ అనుభవం ఎదురైంది. బైకుపై వెళుతోన్న ఓ యువకుడి ముందు ఒక్కసారిగా పొడవాటి చెట్టు పడిపోవడంతో.. దానికి అతని బైక్ ఢీకొనడంతో ఆ యువకుడు ఎగిరిపడ్డాడు. దీంతో వెనకాల వస్తోన్న ఓ లారీ డ్రైవర్ ముందుకు వెళ్లకుండా లారీని అక్కడే ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు చిక్కాయి.   

  • Loading...

More Telugu News