Rahul Gandhi: తాను ధరించిన ఖరీదైన జాకెట్ పై వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ!

  • మేఘాలయ పర్యటనలో రాహుల్ ధరించిన జాకెట్ ఖరీదు రూ.63,000
  • విమర్శలు గుప్పించిన బీజేపీ 
  • తనకు కానుకగా ఇచ్చారని చెప్పిన రాహుల్

మేఘాలయ రాష్ట్రంలో వచ్చే నెల 27న ఎన్నికలు జరగనున్నాయి... ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు.యువ ఓటర్లను ఆకట్టుకునే నిమిత్తం  కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన రాహుల్ ఖరీదైన జాకెట్ ను ధరించారు. ఇంత ఖరీదైన జాకెట్ ను రాహుల్ ధరించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది.

గతంలో ప్రధాని మోదీని ‘సూట్ బూట్ సర్కార్’ అంటూ రాహుల్ చేసిన విమర్శలను ఈ సందర్భంగా మేఘాలయ బీజేపీ శాఖ ప్రస్తావించింది. సూట్ బూట్ సర్కార్ నల్లధనాన్ని అరికట్టిందని, దేశంలో అవినీతిని పారదోలిందని, కాంగ్రెస్ మాత్రం ఇక్కడ సమస్యల ప్రస్తావనకు బదులుగా తమ అసమర్ధతను చాటుకుంటోందని ట్విట్టర్ వేదికగా బీజేపీ నాయకులు మండిపడుతూ, రాహుల్ ఫొటోలను పోస్ట్ చేసింది.కాగా, ఈ విమర్శలపై రాహుల్ స్పందిస్తూ, తాను మేఘాలయాకు చేరుకున్నప్పుడు ఈ జాకెట్ ను తనకు అభిమానంతో కానుకగా ఇచ్చారని అన్నారు. ప్రముఖ బ్రిటిష్ బ్రాండ్ ‘బర్ బెర్రీ’ తయారు చేసిన ఖరీదైన జాకెట్ ను రాహుల్ ధరించారు. దీని ఖరీదు దాదాపు రూ.63,000.

  • Error fetching data: Network response was not ok

More Telugu News