super moon: చంద్రగ్రహణం ప్రారంభం.. ఆకాశంలో అత్యంత అరుదైన దృశ్యం.. మీరూ చూడండి!
- ఆ దృశ్యాన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తోన్న ప్రజలు
- ‘సూపర్ మూన్’, ‘బ్లూ మూన్’, ‘బ్లడ్ మూన్’ల రూపాల్లో చందమామ
- ఇప్పుడు చూసే అవకాశం కోల్పోతే మళ్లీ 2037 వరకు ఆగాల్సిందే
ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. అత్యంత అరుదైన రూపంలో చంద్రుడు కనపడుతుండడంతో ప్రజలు ఆ దృశ్యాన్ని చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘సూపర్ మూన్’, ‘బ్లూ మూన్’, ‘బ్లడ్ మూన్’లను చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అరుదైన దృశ్యం చివరిగా 1982లో కనపడింది. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసే అవకాశం కోల్పోతే మళ్లీ ఇటువంటి దృశ్యాన్ని చూడడానికి 2037 వరకు ఆగాల్సిందే. భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని ‘సూపర్ మూన్’గా పిలుస్తారు. మీరూ చూడండి..