sensex: నష్టాల బాటలోనే కొనసాగిన దేశీయ మార్కెట్లు
- ప్రారంభం నుంచే నష్టాలు
- 68.71 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 22 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బడ్జెట్‌కి ఒకరోజు ముందు కూడా దేశీయ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. లాభాల స్వీకరణపై మదుపర్లు దృష్టి సారించడంతో ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఒకానొక సందర్భంలో కోలుకున్నట్లు కనిపించినా.. అనూహ్యంగా 150 పాయింట్లకు పైగా పడిపోయాయి. 124 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్.. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాలనే చవిచూసింది. ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీలు చివరకు 68.71 పాయింట్లు నష్టపోయి 35,965.02 వద్ద ముగిసింది.
మరోవైపు నిఫ్టీ కూడా 22 పాయింట్ల నష్టంతో 11,027.70 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 63.66 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇన్‌ఫ్రాటెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టాటామోటార్స్ షేర్లు లాభపడగా.. డా.రెడ్డీస్, టాటాస్టీల్, సిప్లా షేర్లు నష్టపోయాయి.