google: ప్లే స్టోర్‌లో కుప్పలుతెప్పలుగా నకిలీ జియో కాయిన్ యాప్‌లు.. జాగ్రత్తగా వుండమంటున్ననిపుణులు!
- వర్చువల్ కరెన్సీ గురించి రిలయన్స్ ప్రకటించగానే పుట్టుకొచ్చిన యాప్‌లు
- ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఒకసారి సరిచూసుకోండి
- ఇంకా విడుదల కాని అధికారిక యాప్
బిట్‌కాయిన్ బూమ్ నేపథ్యంలో తాము కూడా జియో కాయిన్ పేరుతో ఓ వర్చువల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను ఆసరాగా తీసుకుని 'జియో కాయిన్' పేరుతో కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు పుట్టుకొచ్చాయి. ఈ పేరుతో సెర్చ్ చేస్తే ప్లే స్టోర్‌లో 24కి పైగా యాప్‌లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ జియో లోగోతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో ఉండటంతో వినియోగదారులు సులభంగా మోసపోతున్నారు.
అయితే ఇవన్నీ నకిలీ యాప్‌లు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రిలయన్స్ వారు ఇప్పటివరకు అధికారిక యాప్‌ను విడుదల చేయలేదనే విషయం దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ల జోలికి వెళ్లకుంటే మంచిది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనిపిస్తే రేటింగ్స్, కామెంట్లు ఒకసారి పరిశీలించండి. కొన్ని యాప్‌లను ఇప్పటికే చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీటిలో కొన్ని యాప్‌లు వైరస్‌లు కూడా అయిఉండొచ్చు. మరోపక్క, నకిలీ యాప్‌లపై నియంత్రణలు విధించినట్లు చెబుతున్న గూగుల్‌కి ఈ యాప్‌లు కనిపించలేదా? అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.