murders: రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయి.. వీహెచ్ ఆందోళన!
- దేశంలోనే హత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
- నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయింది
- సర్కారు శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైంది
తెలంగాణలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయని, దేశంలోనే హత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెండు రోజుల్లోనే ఏడు హత్యలు జరిగాయని చెప్పారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని, సీఎం కేసీఆర్ ఇటువంటి అరాచకాలను ఆపలేని సీఎంగా నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కారు శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై తాము కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాస్తామని తెలిపారు.