sarathkumar: సోషియో ఫాంటసీగా 'పాంబన్' .. పాము రూపంలో శరత్ కుమార్

- శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'పాంబన్'
- పాము రూపంలో శరత్ కుమార్
- ఆకట్టుకుంటోన్న పోస్టర్స్
కెరియర్ ఆరంభంలో మాస్ యాక్షన్ హీరోగా మార్కులు కొట్టేసిన శరత్ కుమార్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలను చేస్తూ వచ్చారు. తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. ఎస్.ఎస్.కె. నిర్మాణంలో కోలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాకి 'పాంబన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
