srishailam: బయటపడిన సొరంగం.. 8వ శతాబ్దానికి సంబంధించిన వస్తువులు లభ్యం.. భారీగా తరలివస్తోన్న స్థానికులు

  • శ్రీశైలం రుద్రాక్ష మఠంలో తవ్వకాలు
  • దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు
  • సుమారు పది అడుగుల లోతైన సొరంగం
  • త‌వ్వ‌కాల్లో ల‌భించిన పురాత‌న వ‌స్తువులు

శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతోన్న తవ్వకాల్లో అధికారులు సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని కనుగొన్నారు. త‌వ్వ‌కాల్లో పురాత‌న వ‌స్తువులు లభించాయి. అవి 8వ శతాబ్దానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. వాటిల్లో పూజ, వంట వస్తువులు అధికంగా ఉన్నాయని, దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వాటిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News