polavaram: ‘పోలవరం’ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి!: ఏపీ కాంగ్రెస్ నేత గిడుగు రుద్ర‌రాజు

  • నిర్వాసితులకు న్యాయం చేయాలి
  • విభ‌జ‌న హామీల విష‌యంలో ఏపీకి మొండి చెయ్యి
  • ఏపీసీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు  

‘పోలవరం’ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పోలవరం ఆర్ ఆర్ ప్యాకేజీ వల్ల నిర్వాసితులు నష్టపోయారని, 18 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ  పోరాడుతుంద‌ని సృష్టం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. పోలవరం పనులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించి, ఆ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించే అంశంపై ఒక స్పష్టత ఇవ్వ‌డం తమ పార్టీ పోరాటాల ఫ‌లిత‌మేనని అన్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ పనులు స‌త్వ‌రం జ‌ర‌గాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన మహాపాదయాత్ర, సామూహిక సత్యాగ్రహం గురించి ఆయన ప్రస్తావించారు. విభ‌జ‌న హామీల విష‌యంలో న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీకి మొండి చేయి చూపించింద‌ని, ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాల‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా అసంతృప్తికి గురిచేస్తోందని విమర్శించారు. బ‌డ్జెట్ లో ఏపీకి పెద్ద పీట వేస్తారా? రైల్వేజోన్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా? లేదా? అని ప్ర‌శ్నించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారనేది పేరుకే త‌ప్ప‌… కేటాయింపుల‌పై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదని విమర్శించారు.  

  • Loading...

More Telugu News