Vijayawada: విజయవాడ దుర్గగుడి మూసివేత.. మళ్లీ రేపు ఉదయం తెరుచుకోనున్న తలుపులు!

  • కాసేప‌ట్లో సంపూర్ణ చంద్రగ్రహణం
  • అమ్మవారికి మహానివేదన సమర్పించిన పూజారులు
  • అమ్మ‌వారి కవచంతో పాటు అలంకారం తీసివేత

కాసేప‌ట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమ్మవారికి మహానివేదన సమర్పించిన త‌రువాత విజయవాడ దుర్గగుడిని మూసేశారు. మొద‌ట‌ భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేసి, అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ‌వారి కవచంతో పాటు అలంకారాన్ని తీసివేశారు. అలాగే గవ్యాలతో అభిషేకం నిర్వహించి, మూలవిరాట్‌కు ఆచ్ఛాదనా వస్త్రాన్ని కప్పారు. ప్రత్యేక భద్రతా దళ సిబ్బంది ఆధ్వ‌ర్యంలో గుడి తలుపులు మూసివేసి, రేపు ఉదయం ఆలయాన్ని తెరుస్తామ‌ని ప్ర‌క‌టించారు.       

Vijayawada
durga gudi
chandragrahanam
  • Loading...

More Telugu News